ఈ వేసవిలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి టాటా మోటార్స్ నుంచి నిజంగా గుడ్ న్యూస్ అందింది. ఏప్రిల్ నెలలో కంపెనీ తన ప్యాసింజర్ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ల వల్ల కస్టమర్లకు భారీ లాభం కలగనుంది.కంపెనీ తన వివిధ మోడళ్లపై గరిష్టంగా ₹3.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ అయినా సరే, అలాగే ఎలక్ట్రిక్ మోడల్ అయినా సరే, అన్ని విభాగాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.ప్రత్యేకంగా Tata Curvv.ev కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ SUVపై కంపెనీ ₹3.5 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో కన్స్యూమర్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు గ్రీన్ ఇన్సెంటివ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారు ధర సుమారు ₹17.49 లక్షల నుంచి ₹22.24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 45kWh మరియు 55kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌తో సుమారు 400 నుండి 425 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.పెట్రోల్, డీజిల్ SUV సెగ్మెంట్‌లో కూడా టాటా భారీ ఆఫర్లను అందిస్తోంది. Tata Motors పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మరియు కొత్త కర్వ్ వంటి మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది. కర్వ్ పెట్రోల్/డీజిల్ వేరియంట్లపై సుమారు ₹55,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. స్టైల్ మరియు పవర్ కలయిక కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇందులో 1.2-లీటర్ రెవోట్రాన్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ హైపెరియన్ GDI పెట్రోల్, అలాగే 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.అదనంగా, పంచ్ EV, నెక్సాన్ EV మరియు హారియర్ EV వంటి ఎలక్ట్రిక్ మోడళ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ డిస్కౌంట్, అలాగే లాయల్టీ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. మొత్తంగా, ఈ ఆఫర్లు కొత్త కారు కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa