సైబర్ నేరగాళ్ల వలలో యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు చిక్కుకున్నారు. యూనియాన్ బ్యాంక్ లో వాట్సప్ మెస్సేజ్ తో 29. 18లక్షలు స్వాహా చేసింది సైబర్ ముఠా ఖాతాలో నగదు బదిలీ అయినట్టు గుర్తించి బ్యాంక్ అధికారులను మహాలక్ష్మి ఆటో ఎజెన్సీ ఖాతా దారుడు అప్రమత్తం చేశాడు. తప్పు గమనించి నగదు బదిలీ అయిన అకౌంట్ ఫ్రీజ్ చేశారు బ్యాంక్ అధికారులు.జిల్లా కలెక్టర్ పేరిట వాట్స్యాప్ లో పలువురు ప్రభుత్వ ఉద్యోగుల కు డబ్బులు వేయ్యాలంటు సైబర్ నేరాగాళ్ళు కోరారు.
అనుమానంతో కలెక్టర్‌ను సంప్రదిస్తే తాను ఎవరికీ ఎటువంటి మెసేజ్‌లు పంపలేదని, డబ్బులు వేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వ్వవహరం పై సిపి శ్రీకాంత్‌కు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. సిపి ఆదేశాల తో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. గుజరాత్ నుంచి ఈ వ్యవహారాలు నడిపిస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేటు ఉద్యోగుల కు అమెజాన్ గిప్ట్ కార్డు కొనలంటు వాట్స్ యాప్ లో వారి బాస్ పేరిట మెసేజ్ పంపారు. పై అధికారి చెప్పినట్లు చెయ్యాలని భావించి గిప్ట్ కార్డు కొని ప్రైవేటు ఉద్యోగి మోసపోయాడు. దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.