ఇటీవలే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య లార్డ్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 12 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సౌతాఫ్రికా బ్యాటర్ కైల్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్ వేదికలో వందో వికెట్ సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఒకే వేదికలో వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్ రెండో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు.
బ్రాడ్ లార్డ్స్‌లో వందో వికెట్ సాధించడం వెనుక ఒక చిన్న కథ దాగుంది.అది ఏంటి అంటే బ్రాడ్ ఖాతాలో వందో వికెట్‌గా వెనుదిరిగిన కైల్ వెరిన్నే స్టోరీ విషయంలోకి వెళితే లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ను చూడడానికి వికెట్ కీపర్ కైల్ వెరిన్నే తాత కూడా వచ్చారు. స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ ఆస్వాధిస్తున్న ఆయన సౌతాఫ్రికా బ్యాటింగ్ సమయంలో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. అతని పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వెంటనే మెడికల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఐ సీ యూ లో ఉన్న తన తాత పరిస్థితిని సౌతాఫ్రికా క్రికెట్
బోర్డు కైల్ వెరిన్నేకు వివరించారు. వాస్తవానికి కైల్ వెరిన్నే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి.
అప్పటికే సరెల్ ఎర్వీని ని బెన్ స్టోక్స్ ఔట్ చేయడంతో ఐదో వికెట్ కోల్పోయింది. తరవాత కైల్ వెరిన్నే బ్యాటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా అతని స్థానంలో మార్కో జాన్సెన్‌ను పంపించారు. ఇక కైల్ వెరిన్నేను ఏడో స్థానంలో బ్యాటింగ్ రావాలని చెప్పింది. ఈలోగా కైల్ వెరిన్నేకు తన తాతను చూసేందుకు వెళ్లమని చెప్పారట. అలా ఆసుపత్రిలో ఉన్న తాతను చూసి తిరిగి వచ్చాడు. తాత ఆలోచనలతో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెరిన్నే ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వెరిన్నే వెనుదిరిగాడు. కాగా అతని రూపంలో బ్రాడ్‌కు లార్డ్స్‌లో వందో వికెట్ లభించింది. ఇలా తన తాతపై ప్రేమతో మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేకపోయానని మ్యాచ్ ముగిసిన అనంతరం చెప్పుకొచ్చాడు. ఇదీ బ్రాడ్‌కు లార్డ్స్‌లో వందో వికెట్ దక్కడం వెనుక ఉన్న అసలు కథ. ఇక ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన సౌతాఫ్రికా మాంచెస్టర్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ఆడనుంది.