రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు యవత నేతల దుర్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఇదిలావుంటే ఓ రోడ్డు ప్రమాదం టీడీపీకి చెందిన ఇద్దరు యువ నేతలను పొట్టనబెట్టుకుంది. మరో టీడీపీ యువ నేతను ఆసుపత్రి పాలు చేసింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెనువెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
చిత్తూరు జిల్లా పరిధిలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చంద్రగిరి మండల తెలుగు యువత అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌లు అక్కడికక్కడే మరణించారు. వారితో పాటు ప్రయాణిస్తున్న ఐ-టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ సోమశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్న చంద్రబాబు... సోమశేఖరరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa