బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో ఏకగ్రీవంగా నెగ్గింది. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. 2015లో బీజేపీని తానే గెలిపించానని సీఎం నితీష్ అన్నారు. బీజేపీలో మంచివాళ్లకు చోటు లేదని నితీష్ అన్నారు. వాజ్ పేయి, అద్వానీలే తన మాట వినేవాళ్లని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.