అమెరికాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్. విద్యార్థి వీసా(ఎఫ్-1) దరఖాస్తు రిజెక్ట్ అయిన వారికి అదే విద్యా సంవత్సరంలో మళ్లీ అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని అమెరికా నిర్ణయించింది. రిజెక్ట్ అయిన విద్యార్థులు మరోసారి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఈ నెలలో యూఎస్ కొన్ని స్లాట్లు విడుదల చేసింది. స్లాట్లు లభించని విద్యార్థులు అత్యవసర అపాయింట్మెంట్ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు.