ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.50 అడుగులుగా కొనసాగుతుంది.