ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చెరువు మరవపల్లికి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం బతికున్న వ్యక్తిని శ్మశానంలో అతిదారుణంగా రాళ్లతో దాడిచేసి చంపేశారు. ఈ సంఘటన జరిగిన ప్లేసుకు కాస్త దూరంలో ముగ్గులతో, తాంత్రిక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తో నిందితుల కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa