రూ.30 వేల కోసం ప్రియుడితో కలిసి ఓ టినేజర్ మాజీ లవర్ను కిడ్నాప్ చేయించిన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్(22), కెస్తోపూర్కు చెందిన టీనేజర్(18) ప్రేమించుకుని, విడిపోయారు. వారు ప్రేమలో ఉన్నప్పుడు తమల్కి ఆమె రూ.30 వేలు ఇచ్చింది. ఆ డబ్బు కోసం ఆమె తమల్ని ప్రస్తుత లవర్తో కలిసి కిడ్నాప్ చేసింది. దీనిపై తమల్ తండ్రి ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.