యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అమరుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో అమరుద్దీన్ అత్త, కోడలు, కుమార్తె, కుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారు.