జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ చేతుల మీదుగా కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ గా రైగళ్ళ. సాంబశివరావు ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ మేరకు నియామక పత్రాన్ని హైదిరాబాద్ లో గురువారం అందుకున్న సాంబశివరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కైకలూరు లోని అన్ని నియోజకవర్గ మండలాల్లో మండల అధ్యక్షులు నియమించి బీసీల అందరిని కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీ హక్కుల సాధనకు కష్టపడతారని పేర్కొన్నారు ఈ సందర్భంగా రైగళ్ళ సాంబశివరావుని పలు బీసీ సంఘం నేతలు ఘనంగా సత్కరించారు