రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నగరంలో పర్యటనకు పక్కా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్సన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమెరికాకు చెందిన పార్లె ఫర్ ది ఓషన్స్ సంస్థతో శుక్రవారం జరగనున్న ఎంవోయూ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. సెంటర్ ఆవరణలో పార్లె సంస్థ ఏర్పాటు చేయనున్న స్టాల్స్‌ను ఆయన సందర్శించి తగు సూచనలు చేశారు. కన్వెన్షన్ సెంటర్ లోపలి భాగంలోని వేదిక, సిటింగ్ ఏర్పాట్లు కూడా చూశారు