ఈ రోజుల్లో ఇల్లు, భూమి, కారు లేదా బైక్ కొనుగోలు చేయాలంటే చాలామంది బ్యాంకు లోన్లపైనే ఆధారపడుతున్నారు. అయితే చాలా మందిలో ఉండే ప్రధాన సందేహం – ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు? దీనికి ఎలాంటి పరిమితులు ఉన్నాయా? అనేదే.Reserve Bank of India మార్గదర్శకాల ప్రకారం, ఒక వ్యక్తి తీసుకునే లోన్ల సంఖ్యపై నేరుగా ఎలాంటి పరిమితి విధించలేదు. అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. కానీ చివరికి లోన్ మంజూరు చేయాలా లేదా అన్నది సంబంధిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు ముఖ్యంగా మీ డెట్ టు ఇన్‌కమ్ రేషియో (DTI)ను పరిశీలిస్తాయి. అంటే మీ నెలసరి ఆదాయం ఎంత, ఇప్పటికే మీరు ఎన్ని ఈఎంఐలు చెల్లిస్తున్నారు అనే అంశాలను విశ్లేషిస్తాయి. సాధారణంగా మీ ఆదాయంలో సుమారు 30%–35% వరకు మాత్రమే ఈఎంఐలకు కేటాయించడం సురక్షితంగా భావిస్తారు.ఉదాహరణకు, మీకు నెలకు రూ.1 లక్ష జీతం ఉంటే, దాదాపు రూ.30,000–35,000 వరకు ఈఎంఐలు ఉండటం సరైన స్థాయిగా భావిస్తారు. ఈ పరిమితిని దాటితే బ్యాంకులు కొత్త లోన్ మంజూరులో జాగ్రత్తపడవచ్చు. అయితే మీ ప్రస్తుత ఈఎంఐలు తక్కువగా ఉంటే, మరో లోన్ పొందడం సులభమవుతుంది.అదే విధంగా, మీ సిబిల్ స్కోర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు గతంలో తీసుకున్న లోన్లను సమయానికి చెల్లించారా లేదా, ఎక్కడైనా డిఫాల్ట్ చేశారా అనే విషయాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే లోన్ పొందే అవకాశాలు పెరుగుతాయి.మొత్తానికి, ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవాలన్నదానికి స్పష్టమైన పరిమితి లేకపోయినా, అధిక లోన్స్ తీసుకోవడం ఆర్థికంగా ఒత్తిడిని పెంచుతుంది. తక్షణ అవసరాలను తీర్చడంలో లోన్ సహాయపడినా, భవిష్యత్తులో అది భారంగా మారే అవకాశం ఉంది. అందుకే లోన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. “అప్పు తప్పు కాదు.. కానీ అధిక అప్పు మాత్రం ప్రమాదం” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa