Kolkata Knight Riders – Lucknow Super Giants మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్కతా తీవ్ర కష్టాల్లో పడింది. Mohsin Khan అద్భుత బౌలింగ్‌తో 3 వికెట్లు పడగొట్టడంతో కేకేఆర్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.రహానే, సీఫర్ట్, పావెల్‌లను వరుసగా ఔట్ చేస్తూ మొహ్సిన్ మ్యాచ్‌ను పూర్తిగా తన వైపు తిప్పాడు. మరోవైపు రఘువంశీ ‘ఆబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా ఔట్ కావడం వివాదాస్పదంగా మారింది.ప్రస్తుతం క్రీజులో గ్రీన్, రింకూ ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును గట్టెక్కించడం వీరిపై ఆధారపడి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa