తుళ్లూరు: పెదపరిమికి చెందిన అత్తోట రవికి, పాటిబండ్ల బుల్లెమ్మాయి కూతురు నళినికి 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. గురువారం నళిని భర్త తరపు బంధువులు బుల్లెమ్మాయికి ఫోన్ చేసి నళిని చనిపోయిందని చెప్పడంతో వచ్చి చూసి కూతురు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నిరయింది. అత్త, బావ, తోడికోడలు, బంధువులు చెప్పుడు మాటలు విని భర్త నళినిని హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.