గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి పనులు వేగవంతానికి కృషి చేస్తున్నట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్ కుమార్ తెలిపారు. అయినాపురంలో పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. అయినాపురంలో ఓఎన్ జీసీ సీఎస్ ఆర్ నిధులు రూ. 10 లక్షలతో బహుళ ప్రయోజన కార్యకలాపాల కేంద్రం, పల్లిపాలేనికి రూ. 40 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను " ఎమ్మెల్యే శిలాఫలకాలను ఆవిష్కరించారు. అయినాపురం, సి. హెచ్. గున్నేపల్లి గ్రామాల్లో 2. జడ్పీ ఉన్నత పాఠశాలలు, 5 మండల పరి షత్ ప్రాథమిక పాఠశాలల్లో నాడు - నేడు పద కంలో రూ. 150 కోట్లతో అభివృద్ధి పనులకు సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఎంపీపీ కోలా గంగాభవాని, జడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శంకరరావు, కోలా బాబ్జి, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు, జగతా బాబ్జి, మోకా రామారావు తదితరులు పాల్గొన్నారు.