మండలంలోని మేకడోణ, కల్లుకుంట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల కో ఆప్షన్ సభ్యులు షేర్ ఖాన్ పటేల్, కల్లుకుంట సర్పంచ్ ఇస్మాయిల్ శుక్రవారం సర్వసభ్య సమావేశంలో కోరారు. మేకడోణలో హాజరు ఎక్కువ పౌష్టికాహారం పంపిణీ తక్కువని సూపర్వైజర్ శివలింగమ్మను నిలదీశారు. పాత ఇళ్లకు అక్రమార్కులు రహస్యంగా పట్టాలు పుచ్చుకొంటారని నిఘా ఉంచాలని కోరారు.