పల్నాడు జిల్లా, పరిధిలోని పిడుగురాళ్ల సమీపంలో రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌటుపాపాయపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై స్థానిక పోలీస్ వారు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 మందిని అదుపులోకి తీసుకొని 1,04,000/- రూపాయలను రాజుపాలెం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సీజ్ చేసినారు.
ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ... గ్యాంబ్లింగ్ ఆటలకి ఎవరు పాల్పడిన చట్ట పరిధిలో కఠిన శిక్షలకి గురవుతారు కాబట్టి అక్రమాలకు పాల్పడకుండా మంచి నడవడిక కలిగి జీవించాలని పిలుపునిచ్చారు. అలానే వీటి వలన మీరు , మీ కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడానికి , అప్పులు పాలు అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి వాటి జోలికి వెళ్లకూడదని తెలియజేసారు.