బాపట్ల: మున్సిపాలిటీలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శుక్రవారం జిల్లా మలేరియా అధికారి రాజ్ కుమార్ అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో కొబ్బరి డొక్కలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. దోమల నివారణకు పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.