గుంటూరు: జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో శుక్రవారం మరో 28 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారి సుమయా ఖాన్ తెలిపారు. ప్రాంతాల వారీగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 17, తాడేపల్లిలో 1, పెద్దకాకానిలో 1, మంగళగిరిలో4, తెనాలిలో 2, పల్నాడు జిల్లాలో ముప్పాళ్ళ, ఈపూరు, మాచర్లలో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడ్డారు.