ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ఫ్లెక్సీలు కనపడకూడదని జగన్ నిర్ణయం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 06:28 PM

పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కనిపించకూడదు అన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారని టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సెప్టెంబ‌ర్ 2న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్లెక్సీల‌న్నీ ప్లాస్టిక్‌తోనే చేస్తున్న‌వే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన గోరంట్ల... ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలోబ్రదర్ సినిమాలో విలన్ గుర్తుకు వస్తున్నాడు అంటూ సెటైర్ వేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున ఫ్లెక్సీలు క‌నిపించ‌కూడ‌ద‌న్న భావ‌న‌తోనే జ‌గ‌న్ ఈ పిలుపు ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com