అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గొప్ప లక్ష్యంతో సీఎం జగన్ జగనన్న కాలనీలు ఇస్తే... వాటిని నివాస యోగ్యంగా లేకుండా చేశారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారట్లేదు. 3 నెలల్లో పనులు పూర్తికాకపోతే.. గాంధీగిరిలో నిరసన చేపడతాను. సీఎం జగన్ ఆశయాలకు అధికారులు తూట్లు పొడిస్తే చూస్తూ ఊరుకోను' అని స్పష్టం చేశారు.