మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శనివారం ప్రకటించారు.కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగమైనప్పుడు బీజేపీతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సహా ఎవరితోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేయబోవడం లేదు’’ అని ఎన్పీపీ అధ్యక్షుడిగా ఉన్న సంగ్మా తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మేఘాలయలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఎన్పీపీ ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోలేదని, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని సంగ్మా చెప్పారు.