రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం గుజరాత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భు లోని స్మృతివనన్ను ప్రారంభించారు. 2001 భుజ్ భూకంప ఘటనలో మృతిచెందిన వారికి గుర్తుగా ఈ స్మృతివన్ ను ఏర్పాటు చేశారు. అనంతరం అహ్మదాబాద్ లో సబర్మతి తీరాన ఖాదీ ఉత్సవ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి చరఖా తిప్పారు. ఆదివారం గాంధీనగర్ లో జరిగే సుజుకీ సంస్థ 40 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొంటారు.