యూపీలోని ప్రతాప్‌గఢ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్ మౌర్య ఊహించని రీతిలో మరణించింది. పూనమ్‌కు సంజయ్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. గురువారం ఉదయం పూనమ్ చలనం లేకుండా పడి ఉండడం సంజయ్ చూశాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించగా, ఆహారం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయినట్లు తేలింది.