ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరు పట్టణ కేంద్రంలో పర్యటించనున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద డ్రిప్ , స్పింకర్లు , ఇరిగేషన్ పరికరాలు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.