కుప్పంలో తన పర్యటనలో పాల్గొన్న 60 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. 'ధ్వంసం చేసిన వారిని వదిలి టీడీపీ కార్యకర్తలపై కేసులా? పోలీసుల మద్దతుతోనే కుప్పంలో పలుచోట్ల దాడులు జరిగాయి. తప్పు చేసిన పోలీసు అధికారులకు శిక్ష పడేవరకు వదలం. ప్రశాంతమైన కుప్పంలో హింసా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు భయపడవద్దు. అండగా ఉంటాం' అని భరోసా ఇచ్చారు.