జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తమ స్టూడెంట్స్ కు వార్నింగ్ ఇచ్చింది. నేడు జరగనున్న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ను విద్యార్థులు గుంపులుగా చూడకుండా నిషేధం విధించింది. అలా చేస్తే రూ.5 వేల ఫైన్ విధిస్తామని, అలాగే సోషల్ మీడియాలో మ్యాచ్ కు సంబంధించిన పోస్ట్లు పెట్టొద్దని ఆదేశించింది. మ్యాచ్ సమయంలో విద్యార్థులంతా తమ గదుల్లోనే ఉండాలని చెప్పింది.