కుందుర్పి: మండల పరిధిలోని బెస్తరపల్లి గ్రామంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.