ఎలా పడితే అలా రోడ్లను, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆర్ధర్రాతి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్య తలెత్తింది. పాతూరు మార్కెట్లోకి నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత ఆదివారం ఉదయాన్నే మార్కెట్ వద్దకు చేరుకున్నారు.