అగళి: మండలంలో చెరువులు నిండటంతో ప్రజలు, రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నేటితో తీరిందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగళి మండలంలో పి.బ్యాడిగెర, వడగ పంటనహళ్లి, హెచ్ హళ్లి, ఇరిగేపల్లి, కోడిపల్లి గ్రామాలలోని చెరువులు నిండి మరువ పారుతుండటంతో ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగళి చెరువు గత 30 సంవత్సరాలతరువాత సువర్ణ ముఖ్య నది నుండి నీరు చేరడంతో నిండింది.