రైల్వే కోడూరు పట్టణానికి చెందిన శంఖుూరి నరసింహ శంకర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వేకోడూరులో ఫోటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తూ అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపం చెంది సెట్టిగుంట ఉప్పరపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు రాయలసీమ రైలు కిందపడి మరణించగా రైలు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.