విశాఖపట్నం: బీచ్‌కు వెళ్లి ప్రియుడితో పరారైన సాయిప్రియతోపాటు ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. జులై 25న భర్త శ్రీనివాసరావుతో కలిసి వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌కి వెళ్లిన సాయిప్రియ సడెన్‌గా మిస్సైంది. దీంతో పోలీసులు ఆమె కోసం స్పీడ్బోట్లు, నేవీ హెలికాప్టర్ సాయంతో గాలించారు. అయితే ఆమె చేసిన పనికి ప్రభుత్వ ధనం, సమయం వృథా అయిందని కోర్టు అనుమతితో కేసు నమోదైంది.