ఇసుక, మద్యం, నాటుసారా, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం సంబధించి ఎస్. ఈ. బి అధ్వర్యంలో ట్రోల్ ఫ్రీ 14500 ఫిర్యాదు నెంబర్ పోస్టర్ ను జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆవిష్కరించారు. ఎస్. ఈ. బి, పోలీస్ శాఖ సయుక్తంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు ట్రోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే సమాచారం గోప్యంగా ఉంచుతాం అని తెలిపారు. ఫిర్యాదు అందిన తక్షణం ఎస్. ఈ. బి అధికారులు, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్. ఈ. బి అదనపు ఎస్పీ పూజిత, ఎస్. బి డిఎస్పీ చెంచుబాబు తదితరులు పాల్గొన్నారు.