తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మెట్ల శ్రీనివాసరావు సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. గజపతినగరానికి చెందిన మెట్ల శ్రీను ఇంట్లో ఒక్కసారి కుప్పకూలి మృతి చెందాడు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మృత దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీను సేవలందిస్తూ క్రమశిక్షణగల నాయకుడిగా ఎదగారని చెప్పారు. అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షునిగా సేవలందించారని తెలిపారు. శ్రీను మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.