ముంబయిలో అత్యంత సంపన్న గణేష్ మండపాన్ని సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్ ఏర్పాటు చేసింది. ఈ గణేష్ మండపం కోసం ఏకంగా రూ.316 కోట్లకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి బీమా తీసుకుని రికార్డు సృష్టించింది. మొత్తం రూ.316 కోట్లకు బీమా చేయించగా, ఇందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు, రూ.263 కోట్లు మండపానికి. మండప నిర్వాహకులతో పాటు దర్శనానికి వచ్చే భక్తులకు ఈ బీమా వర్తిస్తుంది.