శ్రీకాకుళం: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వినాయక విగ్రహాల సందడి గత రెండు రోజులుగా నెలకొంది. హిందువుల పూజలో మొదటిగా పూజలు అందుకుంటున్న గణేష్ ని విగ్రహాలు కొనడానికి జనాలు ఎగబ్రాకుతున్నారు. బజారులో వినాయక విగ్రహాలు చూడటానికి, కొనడానికి ప్రజలు చేరుకొని వారికి నచ్చిన విగ్రహాలను తమ ఊర్లకు తరలిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా విగ్రహాలు పెట్టడానికి ఎన్నో ఆంక్షలు ఉండడంతో విగ్రహాల విక్రయం సరిగ్గా చేరలేదని వ్యాపారస్తులన్నారు. ఈ సంవత్సరము పూజలు పెట్టడానికి సజావుగా ఉంది కాబట్టి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వ్యాపారస్తులు తెలిపారు.