గుంటూరు జిల్లా, మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో మంత్రి విడదల రజని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ.. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, అర్హులైన ప్రజలకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు.
ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని పక్కాగా అమలుచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.