సంక్షేమ పథకాల అమలు తీరు తెలుసుకునేందుకు అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు గుర్తించేందుకు శ్రీకాకుళం జిల్లా, గార మండలంలోని కొర్ని గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అన్నవి కూడా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తమ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆ రోజు ఏ కార్యక్రమాలనైతే చేస్తామని చెప్పామో వాటిని అన్నింటినీ నిర్వర్తించేందుకు, అదేవిధంగా హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. అక్షరాస్యత స్థానంలో దేశంలో మనం 22 వ స్థానంలో ఉన్నాం. దీనిని మెరుగు పరిచేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు. అందుకు తగ్గ విధంగా పేద వర్గాలు అందరికీ చదువు, నాణ్యతతో కూడిన చదువు అందించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం అని తెలియజేసారు