ఓ పాత్రికేయుడిపై ఏపీ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఓ పాత్రికేయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్వగ్రామంలో నీటి ఎద్దడిపై ఓ చానల్ ప్రతినిధి ప్రశ్నించారు. దాంతో ఆయన ఆవేశంతో ఊగిపోయారు. తన సొంతూర్లో నీటి ఎద్దడి లేదని నిరూపిస్తానని, ఆ మీడియా సంస్థ తన పత్రికను, చానల్ ను మూసుకుంటుందా? అని ముత్యాలనాయుడు సవాల్ విసిరారు. ఒకవేళ తన గ్రామంలో నీటి ఎద్దడి ఉంటే తాను అన్ని పదవులకు రాజీనామా చేయడమే కాకుండా, రాజకీయాల నుంచి కూడా వైదొలగుతానని స్పష్టం చేశారు.