ఉపాధ్యాయులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల సమాజంలో గౌరవభావం పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. స్వతంత్ర ఉద్యమానికి ఉపాధ్యాయులు ఊపిరి పోసిన బ్రిటీష్ ప్రభుత్వం వారి జోలికి రాలేదన్నారు. ఆనాడు ఎక్కడా ఉపాధ్యాయులను అరెస్టు చేయలేదన్నారు. పాఠశాలల్లో పోలీసులు అడుగుపెట్టలేదన్నారు.