బిహార్ లోని పలు చోట్ల ఈడీ దాడులు జరగడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా 1,000 మంది ఎమ్మెల్యేలు, 300 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్లలో ఒక్కరి ఇంటిపైనైనా ఈడీ, సీబీఐ దాడులు జరిగాయా? వాళ్లందరూ పవిత్రమైనవారా? బీజేపీలో చేరితే పవిత్రమైపోతారా? వాళ్లు బీజేపీ నుంచి రక్షణ పొందుతున్నారు' అని విమర్శించారు.