వైయస్ఆర్ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ప్రమాదవశాత్తు మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు వైయస్ఆర్ భీమా పథకాన్ని శనివారం శ్రీకాకుళం నగరంలో ఉన్న డిసిసిబి బ్యాంకులో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి మరణించినప్పటికీ తన కుటుంబానికి వైయస్సార్ భీమా పథకం ద్వారా తన కుటుంబానికి సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆ మొత్తాన్ని తన పిల్లల చదువుకొనుటకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
పాలకొండలోని కస్పా వీధికి చెందిన యందవ మధు అనే వ్యక్తి మరణించడంతో తన భార్య యందవ అనితకు శనివారం డిసిసిబి బ్యాంక్ కార్యాలయంలో రెండు లక్షల రూపాయల చెక్కును తమ బ్యాంకు అకౌంట్లో జమ చేశారు.లీడ్ బ్యాంకు మేనేజర్ బీడీబి హరిప్రసాద్ సహకారంతో ఈ చెక్కును డిసిసి బ్యాంక్ వారి అందజేశారు.లీడ్ బ్యాంకు మేనేజర్ హరిప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి అనేక మందికి వైఎస్ఆర్ భీమా పథకం అందించామని ఆయన తెలియజేశారు.వై. యస్. ఆర్. భీమా పథకంలో ప్రతి ఒక్క పేద కుటుంబం నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఎవరైనా ఆకస్మాత్తుగా మరణిస్తే ఈ పథకం ద్వారా తమ కుటుంబానికి భరోసా ఇచ్చినట్టుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ బీమా పథకంలో చేరవలసిందిగా ఆయనే పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వైఎస్సార్ భీమాలో చేర్పించడానికి అన్ని బ్యాంకు అధికారులు, జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ సీఈవో వరప్రసాదరావు, డిసిసిబి బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.