ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్ధవ్ థాకరే బీజేపీకి నమ్మకద్రోహం చేశాడు: అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 08:04 PM

ఉద్ధవ్ థాకరే బీజేపీకి నమ్మకద్రోహం చేశాడని, అతడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. శివసేనతో బీజేపీ వైరం కొనసాగుతోంది. ముంబయిలో అమిత్ షా మహారాష్ట్ర బీజేపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కమలనాథుల వైఖరి స్పష్టమైంది. రాజకీయాల్లో ఏదైనా సహించవచ్చేమో కానీ నమ్మకద్రోహాన్ని మాత్రం భరించలేమని షా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో మిషన్ 150 సాధించడం ద్వారా ఉద్ధవ్ థాకరేకు బుద్ధి చెప్పాలని అమిత్ షా బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు అమిత్ షా తమ పార్టీ నేతలకు కర్తవ్య బోధ చేశారని జాతీయ మీడియాలో కథనం వచ్చింది. గతంలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ తర్వాత బద్ధశత్రువుల్లా మారాయి. ఇటీవల శివసేనలో షిండే సంక్షోభంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com