టీటీడీ సిబ్బందిపై యూపీ నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. 'ఆమె కేంద్ర సహాయ మంత్రి లేఖతో తిరుమలకు వచ్చారు. ఆమెకు రూ.300 టికెట్ మంజూరు చేశాం. ఆమెతో వచ్చినవాళ్లు వినియోగించుకోలేదు. అడిషనల్ ఈవో ఆఫీసుకొచ్చి రచ్చ చేశారు. మళ్లీ రూ.300 టికెట్ ఇచ్చాం. బ్రేక్ దర్శనం కావాలని గొడవ చేసింది. వీఐపీ దర్శనానికి రూ.10.500 చెల్లించాలని చెప్పాం' అని వివరణ ఇచ్చింది.