గత శనివారం విజయవాడలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ నేత చెన్నుపాటి గాంధీని హాస్పిటల్ కు వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అలానే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ రౌడీలు గాంధీ కంటిని లక్ష్యం చేసుకుని దాడి చేయడం చాలా ఘోరం. తెలుగుదేశం పార్టీ నేతలపై జరుగుతున్న ప్రతి దాడి వెనుక జగన్ రెడ్డి ఉన్నాడు. పోలీసులు కూడా ఉన్నారు. లేకపోతే ఎమోషనల్ గా జరిగిన దాడి అంటూ పోలీసులు మాట్లాడటం ఏంటి? అదేం మాట? మా వాళ్ళకు ఎమోషన్స్ లేవా? గాంధీ పై జరిగిన దాడి విషయంలో దోషులకు శిక్ష పడేవరకు వదిలిపెట్టేదే లేదు.
హత్యా రాజకీయాలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవాలా? ఓటమి భయంతో వైసీపీ రౌడీలు చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏదో ఒకరోజు వైసీపీ నేతలు కూడా రోడ్లపై తిరగలేని రోజు వస్తుంది జాగ్రత్త! అని హెచ్చరించారు.