గుంటూరు జిల్లా పోలీస్ ఆఫీసులో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్ ఆఫీసును సోమవారం సాయంత్రం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది యొక్క పనితీరును పరిశీలించారు. రోజూ రోజుకు సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య వెలుగులోకి వస్తున్నాయని, ఎవరైనా సైబర్ క్రైమ్ కి సంబంధించిన బాధితులు ఉన్నట్లయితే వారికి న్యాయం జరిగే విధంగా ఐటి కోర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.