ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు మండలంలో చోటు చేసుకుంది. బోడుమల్లువారిపల్లికి చెందిన టి. జగదీష్ (26) మంగళవారం బాగేపల్లి నుంచి ద్విచక్ర వాహనంలో తన స్వగ్రామానికి వస్తూ మండలంలోని వేపులబైలు పంచాయితీ, నగరి సమీపంలో, తిరుపతి నుంచి కదిరి వెళుతున్న కారు ఢీ కొంది. దీంతో అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.