లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, చట్ట ప్రకారం నేరమని డెమో శ్రీనివాసులు చెప్పారు. మంగళవారం కర్నూలు శ్రీరామనగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పీసీ పీఎన్డీటీ చట్టం, ఆడపిల్లలు ప్రాముఖ్యతపై ఆయన నర్సింగ్ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లింగనిర్ధారణ పరీక్షలను అరికట్టాలన్ని ప్రభుత్వం గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ నియంత్రణ, దుర్వినియోగ నివారణ చట్టం -1994(పీసీ పీఎన్ఐటీ)ను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.