ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను ప్రారంభించిన మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 09:21 PM

జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈరోజు ఏపీ సచివాలయం బ్లాక్-2లో క్రీడాశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా రూపొందించిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను ఆవిష్కరించారు. ప్రతిభ ఉన్న ప్రతి క్రీడాకారుడిని గుర్తించడమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని రోజా తెలిపారు. ఈ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు సాగేందుకు ఈ యాప్ వారధిగా నిలుస్తుందని, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రోజా అభిప్రాయపడ్డారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa